Header Banner

క్వాంటమ్ వ్యాలీ అమరావతికి గేమ్ ఛేంజర్! దేశంలో మొట్టమొదటిసారిగా.. దీన్ని కూడా వేగంగా పూర్తి!

  Fri May 02, 2025 15:34        Politics

ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం కంప్యూటింగ్ రంగంలో దేశానికే మార్గదర్శిగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అమరావతిలో అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కోసం నేడు ఐబీఎం (IBM), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ అండ్ టూబ్రో (L&T) వంటి దిగ్గజ సంస్థలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా, టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం.. భారతదేశంలోనే మొట్టమొదటి, అత్యంత శక్తివంతమైన ‘క్వాంటం సిస్టం 2’ను అమరావతిలో నెలకొల్పనుంది. ఇది 156 క్యూబిట్ సామర్థ్యం కలిగిన అత్యాధునిక హెరాన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రతిష్ఠాత్మక క్వాంటం వ్యాలీ కార్యకలాపాలను 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

 

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో ఐటీ విప్లవానికి ఏపీ ఊతమిచ్చినట్లే, ఇప్పుడు క్వాంటం విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "ఇది ఏపీకే కాదు, దేశానికే చారిత్రక దినం" అని ఆయన అన్నారు. భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు క్వాంటం కంప్యూటింగ్ పునాది అవుతుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలన్నారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవంతో, దీన్ని కూడా వేగంగా పూర్తి చేస్తామని, ఎల్&టీకి ఇప్పటికే స్థలం కేటాయించామని తెలిపారు. పనుల పర్యవేక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భారత్‌లో ఐబీఎం క్వాంటం సిస్టం 2ను స్థాపించడం దేశ క్వాంటం ప్రయాణంలో కీలక మలుపు అని ఐబీఎం క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా అన్నారు. ఈ భాగస్వామ్యం క్వాంటం అల్గారిథమ్‌ల అభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. క్వాంటం, క్లాసికల్ వ్యవస్థల అనుసంధానంతో జీవశాస్త్రం, మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని టీసీఎస్ సీటీవో డాక్టర్ హారిక్ విన్ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో పరిశోధన, అభివృద్ధికి ఊతం లభిస్తుందని టీసీఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations